Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రమ్య మృతదేహాన్ని సందర్శించిన మంత్రి తలసాని

RAMYAహైదరాబాద్: ఇటీవల బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి కన్ను మూసిన చిన్నారి రమ్య కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఆదివారం ఉస్మానియా ఆసుపత్రితో రమ్య మృతదేహాన్ని సందర్శించారు. చిన్నారి రమ్య మృతి బాధాకరమన్నారు. మధ్యంమత్తులో డ్రైవ్ చేసి చిన్నారి మృతికి కారణమైన యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని తేలిందని మంత్రి అన్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే బలమైన సెక్షన్లు పెట్టి విచారణ చేస్తున్నారని మంత్రి తెలిపారు. కారు ప్రమాదంలో రమ్య కుటుంబం చిన్నాభిన్నమైందని అన్నారు. ప్రభుత్వం తరుఫున వారికి కావాల్సిన సహాయం అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రికలో రమ్య భౌతిక కాయానికి పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం మృతదేశాన్ని అంబడర్‌పేటలోని స్వగృహానికి తరలించారు.

Comments

comments