Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

టివి షోకి వ్యాఖ్యాతగా రానా

Rana-Daggubati-No.1-Yaari

హైదరాబాద్ : బాహుబలి చిత్రంలో భళ్లాలదేవుడి పాత్రలో మనందరిని మెప్పించిన రానా దగ్గుబాటి తొలిసారిగా బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లోనూ మంచి ఫాలొయింగ్ సంపాదించుకున్న రానా వ్యాఖ్యాతగా ఓ షోలో కనిపించనున్నట్టు స్వయంగా ప్రకటించారు. బాలీవుడ్ లో సూపర్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ తరహాలో నెంబర్ వన్ యారీ విత్ రానా అనే షోకి రానా యాంకర్ గా వ్యవహరిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ షోకు సంబంధించిన టీజర్ ను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేశారు. మరి ఈ షో జెమిని ఛానల్ లో ప్రసారం కానుంది.  మీ అభిమానుల నటులతో, అద్భుతమైన స్నేహాన్ని పంచేది ఈ షో అని రానా పేర్కొన్నారు. రానా టివి హోస్ట్ గా వస్తున్నాడని తెలియగానే అతనికి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

comments