Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మరో ప్రయోగాత్మక చిత్రంలో..

rana

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘బాహుబలి’ రానాకు ఎంతో క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఈ పాపులర్ స్టార్ ప్రస్తుతం కొత్త తరహా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడు రానా మరో ప్రయోగాత్మక చిత్రాన్ని చేయబోతున్నట్టు తెలిసింది. ఇటీవల సిద్ధార్థ్‌తో ‘గృహం’లాంటి బ్లాక్‌బస్టర్ హార్రర్ మూవీ చేసిన దర్శకుడు మిలింద్‌రాయ్‌తో రానా సినిమా చేయబోతున్నాడట. మిలింద్ చెప్పిన స్టోరీలైన్ రానాకు బాగా నచ్చింది. అయితే ఇది హార్రర్ జోనరా లేదా ఇంకేదైనా కొత్త తరహా కథా చిత్రమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇది కూడా ఓ ప్రయోగాత్మక చిత్రమని సమాచారం. ద్విభాషా చిత్రంగా ఇది తెరకెక్కనుంది. కానీ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఈమధ్య యాంకరింగ్‌తో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్న రానా ఎంతో బిజీగా ఉన్నాడు. తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 2కు రానాను యాంకర్‌గా తీసుకునే ఆలోచనలో స్టార్ మా ఛానల్ ఉన్నట్టు సమాచారం.

Comments

comments