Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఓ ఇంటివాడు కాబోతున్న రణబీర్

ranbir-kapoorఅమ్మాయిల కలల రాకుమారుడు, బాలీవుడ్ హీరో రణబీర్‌కపూర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రణబీర్ పెళ్లి అనగానే ఆ హీరోయిన్ ఎవరని అడుగుతారు ఎవరైనా. కానీ రణబీర్ పెళ్లిచేసుకోబోయేది హీరోయిన్‌ను కాదు. తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకోబోతున్నాడు ఈ 34 ఏళ్ల కపూర్ హీరో. గత వారమే తల్లి నీతూకపూర్‌తో కలిసి లండన్ వెళ్లాడు రణబీర్ కపూర్. పేరుకు ఇది వేసవి సెలవులు అయినప్పటికీ అక్కడే రణబీర్‌కు పెళ్లిచూపులు అయిపోయాయట. ఈ కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు ఈ స్టార్ హీరో కోసం అక్కడే రెండు, మూడు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. అలా చూసిన ఎన్నారై అమ్మాయిలో నుంచి ఒక అమ్మాయిని ఎంపిక చేయడమే రణబీర్ పని. గతంలో రణబీర్, కత్రినాకైఫ్‌లు చాలా కాలం ప్రేమించుకున్నారు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. పెళ్లి మాత్రమే మిగిలిపోయింది అనుకున్నారంతా. కానీ వాళ్లిద్దరూ విడిపోయారు. కత్రినా కంటే ముందు మరో ఇద్దరు హీరోయిన్లతో రణబీర్ డేటింగ్ చేసినప్పటికీ ఆ రిలేషన్‌షిప్ కూడా వర్కవుట్ కాలేదు. చివరికి ఇంట్లో చూసిన సంబంధమే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట రణబీర్‌కపూర్.

Comments

comments