Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పెళ్లికి సిద్ధమవుతున్న రణబీర్‌కపూర్?

ranveer

బాలీవుడ్‌లో హీరోహీరోయిన్లు డేటింగ్‌లో ఉన్నారని రోజుకొక టాక్ వినిపిస్తుంటుంది. ఒక్కోసారి అవి నిజాలు కావచ్చు లేదా అబద్ధాలు కావచ్చు. అయితే ఈ ఊహాగానాలను తారలు పట్టించుకోకపోయినా వారి ఇంట్లోవాళ్లు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటారు.  కొంతమంది తారలు తమ కెరీర్ గురించి ఇంట్లో చెప్పనిదే ఏమాత్రం సొంత నిర్ణయాలు తీసుకోరు. రణబీర్‌కపూర్ కూడా ఇంట్లో వాళ్లకు చెప్పనిదే ఏ పని చేయడట. కాకపోతే తన సొంత నిర్ణయాలకు వారు ఎప్పుడు సానుకూలంగానే ఉంటారని అతను చెబుతుంటాడు.  అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో వస్తున్న టాక్ ఏమిటంటే రణబీర్ పెళ్లి గురించి ఇంట్లోవాళ్లు  అతనిపై వత్తిడి తెస్తున్నారట. ముఖ్యంగా అతని తల్లి నీతూ సింగ్ తన కొడుకు కోసం ఒక మంచి అమ్మాయిని వెతుకుతోందట. అయితే గత కొంతకాలంగా ఈ హీరో మాత్రం పాక్ భామ మహీరాఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడని… పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా నీతూ మాత్రం తన కుమారుడు రణబీర్‌కు మంచి అమ్మాయిని వెతికే పనిలో ఉందట. మహీరాఖాన్‌తో రణబీర్ డేటింగ్ చేస్తుండడంతో తొందరగా అతనికి పెళ్లి చేయాలని ఆమె నిర్ణయించుకుందట. మరి రణబీర్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అనేది చూడాలి.

Comments

comments