Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కత్రినాకైఫ్‌ను ఆకాశానికెత్తేసిన రణబీర్

Ranbir

బాలీవుడ్‌లో  కెరీర్ ప్రారంభం నుంచి రణబీర్ కపూర్ ప్రేమ కథలు వినిపిస్తూనే ఉన్నాయి. పలువురు హీరోయిన్లతో రణబీర్ ప్రేమాయణాన్ని కొనసాగించి వారికి బ్రేకప్ చెప్పాడు. ఇప్పుడు రణబీర్, కత్రినాకైఫ్ విడిపోయిన తర్వాత వారిద్దరూ కలిసి నటించిన ‘జగ్గా జాసూస్’ సినిమా  ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొంత కాలం క్రితం వీరిద్దరు గాఢమైన ప్రేమలో మునిగితేలిన తర్వాత ఇద్దరిమధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయితే తాజాగా సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు ఫిల్మ్ మేకర్స్. ఈ వేడుకలో రణబీర్, కత్రినాకైఫ్, చిత్ర దర్శకుడు అనురాగ్ బసు పాల్గొన్నారు. ఈ వేదికపై రణబీర్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. “కత్రినాకైఫ్ చాలా పెద్ద స్టార్. ఆమె నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. తన కోసం తానే ఒక సినిమా తీసుకోగలిగే సత్తా ఉంది ఆమెకు. తను ఒక సూపర్ హిట్ ఫిల్మ్ మెషిన్‌”అని రణబీర్ చెప్పాడు. దీంతో పక్కనే ఉన్న కత్రినా చిరు నవ్వులు చిందిస్తూ… చాలా థాంక్స్ రణబీర్ అని అంది. ఈ జంట గతంలో అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ, రాజనీతి అనే రెండు సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. రణబీర్ ప్రస్తుతం సంజయ్‌దత్ బయోపిక్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Comments

comments