Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఐష్‌ను టచ్ చేయగానే చెమటలు పట్టేశాయి!

ae-dil‘ఎ దిల్‌హై ముష్కిల్’ చిత్రంలో తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణబీర్‌కపూర్‌తో రొమాన్స్ చేసింది ఐశ్వర్యారాయ్. తెరమీద వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందన్న టాక్ వినిపించింది. అయితే తొలిసారి ఐశ్వర్యారాయ్ పక్కన నటన అనగానే మొదట్లో రణబీర్‌కు టెన్షన్ పట్టుకుందట. ఈ సినిమాలో ఐష్‌తో నటించిన అనుభవాల గురించి రణబీర్ చెప్పాడు. ఈ సినిమా ఆఫర్ తన దగ్గరకు వచ్చినప్పుడు హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ నటిస్తుందని చెప్పగానే అతను ఎగిరిగంతేశాడట. అయితే అక్కడి నుంచి రణబీర్‌కు అసలు టెన్షన్ మొదలైందట. ఎందుకంటే ఐశ్వర్యారాయ్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రోజుల్లో రణబీర్ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడట. అప్పట్లో ఆమె సినిమాలు చూసి మురిసిపో యేవాడట.  అంతేకాదు ఐశ్వర్య నటించిన ‘ఆ అబ్ లౌటు చలే’ చిత్రానికి రణబీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ సినిమా షూటింగ్‌లో ఆమెను అలా చూస్తూ ఉండిపోయేవాడట. అయితే అలాంటి ఐష్ తన పక్కన హీరోయిన్‌గా నటించనుందని అనుకుంటూ కాస్త భయపడుతూనే తొలిరోజు సెట్‌కు వెళ్లానని రణబీర్ చెప్పాడు. “సినిమా షూటింగ్‌లో భాగంగా ఐశ్వర్యారాయ్‌ను తొలిసారి టచ్ చేయగానే చెమటలు పట్టేశాయి. ఆమె దగ్గరికి వస్తుంటే నాకు చేతులు వణికిపోతూ ఉండేవి”అని రణబీర్ అన్నాడు. తన టెన్షన్ చూసి “చిన్న పిల్లాడిలా ఇలాంటి వేషాలు మానుకో. సీన్‌లో సరిగా నటించు”అని ఐష్ తనకు ధైర్యం చెప్పిందని అన్నాడు. ఆతర్వాత తనకు నమ్మకం పెరిగిందని రెగ్యులర్ హీరోయిన్‌ల పక్కన ఎలా చేస్తానో అలాగే నటించానని రణబీర్ తెలిపాడు. “ఆమె నాకంటే వయసులో పెద్ద. అంతకుమించిన స్టార్ హీరోయిన్. అయినా సరే… ఎలాంటి భేషజాలు ఐష్‌కు లేవు. ఎంతో ఫ్రెండ్లీగా నాతో నటించింది”అంటూ తన సినిమా ముచ్చట్లు చెప్పాడు రణబీర్ కపూర్.

Comments

comments