Search
Sunday 18 November 2018
  • :
  • :

బాలీవుడ్‌లో కొత్త ప్రేమాయణం

b

బాలీవుడ్‌లో కొత్త ప్రేమ పావురాలు పుట్టుకొస్తున్నాయి. డేటింగ్, సహజీవనం ఇవన్నీ అక్కడ సహజమే అయినా ఇవన్నీ బయటపడటం అనేది అరుదుగా జరుగుతుంది. అయితే ప్రేమలో మునిగిపోయిన ఓ కొత్త జంట గురించి తోటి హీరోయిన్ చెప్పడంతో ఈ వ్యవహారం అందరికీ తెలిసిపోయింది. ఆ కొత్త ప్రేమ జంట రణబీర్ కపూర్, అలియాభట్ కాగా… వారి ప్రేమాయణాన్ని సోనాక్షి సిన్హా బయటపెట్టింది. ఈ ఏడాది ముగిసేలోపు వాళ్లిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పెళ్లి పీటలెక్కుతారని వారి తరపున సోనాక్షి చెప్పడం విశేషం. రణబీర్ కపూర్ కోసం ఓ సినిమాను సైతం త్యాగం చేసి అతనితో లోతైన ప్రేమలో అలియాభట్ మునిగి తేలుతోందట. ఈ వార్త బయటకు రావడంతో కపూర్‌ల వంశం మూడో తరం వారసుడి పెళ్లి త్వరలోనే జరుగనుందని బాలీవుడ్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. ప్రస్తుతం రణబీర్‌కపూర్, అలియాభట్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

Comments

comments