Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

‘రంగస్థలం’ టైటిల్ సాంగ్‌లో చెర్రీ చెడుగుడే…

Ranga-Ranga-Rangasthalaana-

హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, రాంచరణ్ కాంబోలో వస్తున్న ‘రంగస్థలం’ చిత్రం నుంచి ‘రంగ రంగ రంగస్థలాన’ అంటూ సాగే టైటిల్ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు ఈ మూవీకి అదనపు ఆకర్షణ అనడంతో ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా విడుదలైన  టైటిల్ సాంగ్‌లో హుషారెత్తించే దేవి బీట్ పై చెర్రీ అంతే హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇప్పటికే విడుదలైన ఆడియో, టీజర్, ట్రైలర్ లతో మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. చరణ్ సరసన తొలిసారి హీరోయిన్ గా నటిస్తోంది సమంత. చరణ్ సోదరుడి పాత్రలో ఆది పిన్నిశెట్టి నటిస్తున్నాడు. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మార్చి 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

comments