Home తాజా వార్తలు ప్రాణం తీయొద్దు

ప్రాణం తీయొద్దు

rangareddy

ప్రాణహిత ప్రాజెక్టుకు తిలోదకాలిచ్చి జిల్లాకు అన్యాయం చేయొద్దంటూ రంగారెడ్డి
జడ్‌పి సమావేశంలో కాంగ్రెస్ ఆందోళన, అరెస్టుల పర్వం

మన తెలంగాణ /రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. చేవెళ్ల – ప్రాణహితను అడ్డుకోవద్దని, గతంలో ప్రతిపాదించిన ప్లాన్ ప్రకారమే పనులు చేయాలని కోరుతూ తీర్మానం చేయాలని కోరుతు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపిపిలు పట్టుబట్టారు. జిల్లా పరిషత్ సమావేశం జడ్‌పి చైర్‌పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వెంటనే పరిగి శాసనసభ్యుడు రామ్మోహన్‌రెడ్డి నేరుగా ప్రాణహిత-చేవెళ్ల విషయం లేవనెత్తి ప్లాన్ మార్చి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను ప్రాణహిత-చేవెళ్ళ నుంచి తొలగించిందని, ఎటువంటి మార్పులు చేయకుండా ఈప్రాజెక్టును కొనసాగించాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్‌పిటిసి, ఎంపిపిలు ప్ల్లకార్డులు పట్టుకుని ముందుకు వచ్చి నినాదాలతో హోరెత్తించారు. మెదక్ జిల్లా కోసం రంగారెడ్డి జిల్లా కు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జై దక్షిణ తెలంగాణ అంటూ కొత్త నినాదాలు చేశారు. అరగంట సేపు నినాదాలతో సభ స్తంభించగా మంత్రి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి శాసనసభ్యుల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం తీర్మానం విష యంపై చర్చిద్దామన్నారు. టిడిపి శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, బిజెపి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మినహా అంతా టిఆర్‌ఎస్ కు చెందిన వారు కావడంతో వారు నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుందామని, తీర్మానాలు అవసరం లేదని అన్నారు. దీంతో మహేందర్‌రెడ్డిసిఎం వద్ద కు అందరిని తీసుకుపోయి మాట్లాడుదామని చెప్పి సభను కొనసాగించడానికి ప్రయత్నం చేశారు. కాని తీర్మానం చేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. కాంగ్రెస్ వారికి వ్యతిరేకంగా ఆధికార పార్టీకి చెందిన జడ్‌పిటిసి, ఎంపిపిలు కమీషన్ల కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు చొచ్చుకవచ్చారు. రెండు పార్టీల నాయకులు మంత్రి ముందు బాహాబాహీకి దిగడానికి సిద్ధమయ్యారు. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడు మరింత రెచ్చిపోయి కాంగ్రెస్ వారిపై దూకుడుగా వ్యవహరించారు. వారికి సర్దిచెప్పడానికి మంత్రి, చైర్‌పర్సన్, కలెక్టర్ ప్రయత్నించారు. అయినా పరిస్థితి సద్దుమణుగక పోవడంతో మంత్రి మహేందర్‌రెడ్డి సభను అరగంట వాయిదా వేస్తున్నామని చెప్పి బయటకుపోవాలని చూశారు. తలుపు వద్దఅప్పటికే సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మంత్రిని అడ్డుకున్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు కార్తీక్‌రెడ్డి, రవికుమార్ యాదవ్, ఇంద్రపాల్ రెడ్డి తదితరులు మంత్రిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనితో లోపల సభను అడ్డుకుంటున్న వారితో పాటు బయట నిరసన చేపట్టిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశం సాగింది.
కాళ్లు పట్టి ..ఈడ్చుకెళ్లి..
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చరిత్రలో ఏనాడు లేని విధంగా పోలీసులు లోపలికి వచ్చి జడ్‌పిటిసి, ఎంపిపిల కాళ్లు పట్టుకుని లా క్కుంటూ పోయి బయటపడేశారు. పరిగి శాసనసభ్యుడు రామ్మోహ న్‌రెడ్డి, జిల్లా పరిషత్ కాంగ్రెస్ పక్ష నాయకుడు జంగారెడ్డి తో పాటు అందరిని అక్కడి నుంచి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. చేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చారి కార్తీక్‌రెడ్డి, డిసిసి అధ్య క్షుడు, డిసిఎంయస్ చైర్మన్ శ్రావణ్, డిసిసిబి మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ లు లకా్ష్మరెడ్డి, క్రిష్ణారెడ్డి, పిఎసిఎస్ చెర్మెన్ బలవంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు రవికుమార్ యాదవ్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. మహిళ ఎంపిపి, జడ్‌పిటిసిలను కూడ అరెస్టు చెసి వారిన ందరినీ పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు తరలించారు. పంజాగుట్ట పోలీ సు స్టేషన్‌కు కాంగ్రెస్ నాయకుల తాకిడి అధికం కావడంతో అనంతర ం వారిని వదిలివేశారు. మిర్యాలగూడ శాసనసభ్యుడు భాస్కర్‌రావుతో పాటు పలువురు గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుస్టేషన్‌కు తరలివచ్చి సంఘీభావం తెలిపారు