Search
Wednesday 21 November 2018
  • :
  • :

‘రంగస్థలం’లో రామలక్ష్మీ.. రప్ఫాడించింది…(టీజర్)

Samantha

హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కాంబొలో వస్తున్న చిత్రం రంగస్థలం. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరీ ప్రశంసలు అందుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో దుమ్ముదులేపిసింది. తాజాగా హీరోయిన్ సమంతకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మూవీలో సమంతను రామలక్ష్మీ పేరుతో పరిచయం చేశారు. టీజర్ లో సమంత మేకప్ లేకుండా సహజ నటనతో అదరగొట్టింది. ‘ఈ పిల్లెదురు వ‌స్తుంటే మా ఊరికి 18 సంవత్సరాల వ‌య‌స్సు వ‌చ్చిన‌ట్టుంట‌దండి.. ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెట్టించింది రామ‌ల‌క్ష్మేనండి అంటూ గోదావ‌రి యాసలో చ‌ర‌ణ్ బ్యాక్ గ్రౌండ్‌లో చెబుతుండ‌టం అందరినీ కట్టిపడేస్తోంది. సమంత టీజర్ తో రంగస్థలంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

comments