Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఎదిగేటప్పుడు మనతో పాటు పది మందిని పైకి తీసుకెళ్లాలి

ram

రామ్‌చరణ్, సమంత జంటగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం (మోహన్) నిర్మించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రం ఘన విజయం సాధించి 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సినిమా ‘100 రోజుల’ వేడుకను హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ “సుకుమార్ ఆలోచనే ఈ సినిమా. ఆయన ఆలోచన, మొండి బలం ఈ సినిమా ప్రారంభం కావడానికి కారణం. ఆయన వల్లే ఈ సినిమా 100 రోజులను పూర్తిచేసుకుంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పాటలకు డ్యాన్స్ మాస్టర్స్ ఎంతో కష్టపడి నాతో డ్యాన్స్ చేయించారు. సమంత, ప్రకాశ్‌రాజ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు అద్భుతంగా నటించారు. అలాగే రంగమ్మత్తగా అనసూయ చక్కగా నటించింది. ‘ఎదిగేటప్పుడు మనతో పాటు పది మందిని పైకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే ఆ పదిమందే మనల్ని కాపాడుతారు’ అని నాన్నగారు చెప్పేవారు. మమ్మల్ని, మా ఇండస్ట్రీని కాపాడే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సంతోషంగా ఉంటే మేం సంతోషంగా ఉంటాం. ఈ సినిమా ద్వారా వాళ్లకు లాభాలు వచ్చి సంతోషంగా ఉన్నారు”అని అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “కథ విన్న వెంటనే చరణ్ ఓకే చెప్పి ఉండకపోతే వేరే కథతో సినిమా చేసేవాడిని. ఈ సినిమా అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం చరణే. ఇంత మంచి ప్రాజెక్ట్‌ను నిర్మించిన నిర్మాతలకు థాంక్స్. రత్నవేలు లేకుంటే విజువల్స్ ఇంత బాగా వచ్చేవి కావు. దేవిశ్రీ ప్రసాద్ నా ఆత్మ. అతను అద్భుతమైన సంగీతాన్ని అందించాడు”అని తెలిపారు. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ “వంద రోజుల సినిమాను ఇచ్చిన రామ్‌చరణ్, సుకుమార్‌కు థాంక్స్. మా జీవితంలో మరచిపోలేని సినిమా నిది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి రవిశంకర్, సివిఎం (మోహన్), దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, అనసూయ, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments