Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

టీజర్‌కు ముహూర్తం కుదిరింది

Cherry

‘రంగస్థలం’ సినిమా విషయంలో అభిమానులది సుదీర్ఘ నిరీక్షణ. ఈ సినిమా మొదలై దాదాపు ఏడాది కావస్తోంది. ముందు ఈ సినిమాను ఈ ఏడాది దసరాకే రిలీజ్  చేస్తారన్నారు. కానీ తర్వాత షెడ్యూల్ సంక్రాంతికి మారింది. ఆపై వేసవికి వెళ్లిపోయింది. ఇప్పటివరకు ఈ సినిమా ఫస్ట్‌లుక్ మాత్రమే అభిమానుల ముందుకు వచ్చింది. రెండు వారాల కిందట వచ్చిన ఆ ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇక టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా ‘రంగస్థలం’ టీజర్ రిలీజవుతుందట. ఫస్ట్‌లుక్ తరహాలోనే సుకుమార్ ముద్ర ఉంటుందని… దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. మూడు దశాబ్దాల కిందట కోస్తాంధ్ర పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం’. అక్కడి పల్లెల్లో సంక్రాంతి పండుగను గొప్పగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి ఫ్లేవర్ ఉండేలా ఈ టీజర్‌ను తీర్చిదిద్దుతున్నారట. రామ్‌చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్‌లుక్ రిలీజ్ రోజే ప్రకటించిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Comments

comments