Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘చిట్టిబాబు’ మరింత దగ్గరయ్యాడు: రాజమౌళి

Rangasthalam

హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘రంగస్థలం’. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని ఆదివారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన చిత్ర ట్రైలర్ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిట్టిబాబు పాత్రలో చరణ్ ఒదిగిపోయాడని, ఆ పాత్రలో అతడిని తప్ప వేరే వారిని ఊహించుకోలేమంటూ కొనియాడుతున్నారు. తాజాగా ట్రైలర్ పై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ట్రైలర్ చూసిన అనంతరం ‘చిట్టిబాబు’ మరింత దగ్గరయ్యాడని ఆయన పేర్కొన్నారు. జగపతి బాబు పాత్ర కూడా చాలా బాగుందని, సినిమా విడుదల కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Comments

comments