Home తాజా వార్తలు క్రిష్‌కు కంగన సోదరి కౌంటర్ అటాక్!

క్రిష్‌కు కంగన సోదరి కౌంటర్ అటాక్!

Rangoli And Kangana Ranautముంబై: ఇటీవలే విడుదలై విజయం సాధించిన మణికర్ణిక చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి మధ్యలోనే తప్పుకున్న దర్శకుడు క్రిష్ చిత్రం విడుదలైన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ సోమవారం ట్విట్వర్ ద్వారా స్పందించారు. మణికర్ణిక చిత్రం విడుదలైన నేపథ్యంలో మొట్టమొదటిసారి ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకోవలసి వచ్చిందో ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో క్రిష్ వెల్లడించారు. నేనా చిత్రాన్ని చూశాను. 70 శాతానికి పైగా నేను దర్శకత్వం వహించిన సన్నివేశాలే ఉన్నాయి. చిత్రం విడుదలయ్యే దాకా మౌనంగా ఉండదలచుకున్నాను. ఈ చిత్రం కోసం..చిత్రం కోసం ఎంతో శ్రమించిన మొత్తం యూనిట్ కోసం మౌనం దాల్చాను. ఈ చిత్రానికి కంగన ఏం చేసిందో ఇప్పుటికైనా నేనే చెప్పకపోతే మా కష్టానికి అన్యాయం చేసిన వాణ్ణవుతాను. నా నుంచి చిత్రాన్ని లాక్కున్న తర్వాత వెంటనే మాట్లాడమని చాలా మంది నాకు సలహా ఇచ్చారు. నేను దర్శకత్వం వహించిన చిత్రం బంగారమైతే కంగన దాన్ని వెండిగా మార్చిందని మాత్రం చెప్పగలను అంటూ క్రిష్ వ్యాఖ్యానించారు.

దీనిపై కంగన రనౌత్ సోదరి రంగోలి చందేల్ తీవ్రంగా స్పందిస్తూ తన సోదరికి బాసటగా నిలబడ్డారు. డైరెక్టర్ క్రిష్..మీరే ఈ చిత్రాన్ని మొత్తం దర్శకత్వం వహించారని ఒప్పుకుంటున్నాను. ఇక ఇంతటితో ఆపెయ్యండి. అయినప్పటికీ ఈ చిత్రంలో కంగనయే ప్రధాన పాత్రధారి. ఈ విజయాన్ని, అందుతున్న ప్రశంసలను ఆమెను ఆస్వాదించనివ్వండి. మేమంతా మిమల్ని నమ్ముతున్నాం..దయచేసి ఇక ఇంతటితో ఆపెయ్యండి..ఆమెను ఒంటరిగా వదిలివేయండి అంటూ రంగోలి ట్వీట్ చేశారు.

Rangoli Asks Krish to keep calm, Kangana Ranaut’s sister Rangoli Chandel has come in support of the Manikarnika actress