Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

తవ్వకాల్లో బయట పడిన రాణి రుద్రమదేవి శిల్పాలు

 Rani Rudramadevi sculptures outside the excavation

బషీరాబాద్‌ః బషీరాబాద్ మండల పరిధిలోని ఎక్మాయి గ్రామంలో గోందలోలు (చిలుక జోశ్యం చెప్పేవారు) శుక్రవారం నూతన గృహ నిర్మాణం నిమిత్తం పురాతన శిధిలమైన మట్టి కోటను ఆనుకుని ఉన్నా ఖాళీ స్థలంలో జేసిబితో పునాదులు తవ్వగా పురాతన శిల్పాలు బయట పడ్డాయి. దీంతో వారు పునాదులు తవ్వడం నిలిపి వేశారు. ఆదివారం గ్రామస్తులు సుదర్శన్, శ్రీనివాస్ రడ్డి, శ్రీనివాస్ గౌడ్, బస్వరాజ్, గోపాల్ గ్రామస్తులు వెళ్ళి ఆ శిల్పాలను పరిశీలించగా అవి కాకతీయుల కాలం నాటి రాణి రుద్రమ దేవి రాతి శిల్పాలని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఆనాడు విజయానికి గుర్తుగా ఆమే సామంత రాజులు ప్రతిష్టించి ఉండవచ్చునని ఊహిస్తున్నారు. దీని వలన ఈ ప్రాంతము కూలి కుతుబ్ షాహీలకు ముందు కాకతీయుల పరిపాలనలో ఉండేదని, మొగులాయిలు ఆ సంస్కృతిని ధ్వంసం చేసి నేల మట్టం చేసినట్లు పలువురు పెద్ద మనుషులు తెలిపారు.

Comments

comments