Home సినిమా రన్యారావు టాలీవుడ్ ఎంట్రీ

రన్యారావు టాలీవుడ్ ఎంట్రీ

Ranya-Rao

చరణ్ తేజ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆయుష్మాన్‌భవ’. త్రినాథ్‌రావు నక్కిన కథ, దర్శకత్వ పర్యవేక్షణలో మారుతి సహ నిర్మాతగా రూపొందుతున్న చిత్రమిది. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మీట్ బ్రోస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాప్ సింగర్ జెన్నిఫర్ క్యారెక్టర్‌లో ఆండ్రియా నటిస్తోంది. హుజాన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ బ్యూటీ రన్యారావు ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె మోడ్రన్ సావిత్రిగా కనిపించనుంది. గతంలో కన్నడ భాషలో సుదీప్ సరసన, తమిళంలో విక్రమ్ ప్రభు సరసన నటించి ఆమె మంచి పేరు సంపాదించుకుంది. పరుచూరి వెంకటేశ్వరరావు, రంగరాజన్, అశ్విన్ నిఖిత తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః దాశరధి శివేంద్ర, ఆర్ట్‌ః పి.ఎస్.వర్మ.