Home తాజా వార్తలు సమంత కొడుకుగా రావు రమేశ్

సమంత కొడుకుగా రావు రమేశ్

Rao Ramesh Act as Samantha's sonహైదరాబాద్‌: ప్రముఖ హీరోయిన్ సమంత కొడుకు పాత్రలో ప్రముఖ నటుడు రావు రమేశ్‌ నటించనున్నారు. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించబోయే ఈ సినిమాలో  వీరిద్దరు తల్లీకొడుకుగా నటించనున్నారు. సమంత ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ చిత్రానికి ‘ఓ బేబీ’, ‘ఎంత సక్కగున్నావే..’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కొరియాలో ఘన విజయం సాధంచిన ‘మిస్‌ గ్రానీ’ అనే చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతోందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.  సమంత 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రతో పాటు 20 ఏళ్ల యువతిగా రెండు పాత్రల్లో నటించనుంది. హీరో నాగశౌర్య సమంత భర్త పాత్రలో నటించే అవకాశం ఉందని సమాచారం. 2015లో వచ్చిన ‘మిస్‌ గ్రానీ’ సినిమాను వాంగ్‌ డాంగ్‌యుక్‌ తీశారు. ఓ 70 ఏళ్ల వృద్ధురాలు ఫొటో తీయించుకునేందుకు ఓ ఫొటో స్టూడియోకి వెళుతుంది. అక్కడ ఫొటో తీయించుకుని బయటకు వచ్చాక అచ్చం తన పోలికలతో ఉన్న ఓ 20 ఏళ్ల యువతిని చూస్తోంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేశ్‌ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సమంత తన భర్త అక్కినేని నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

Rao Ramesh Act as Samantha’s son