Search
Thursday 15 November 2018
  • :
  • :

బాలికపై బావ అఘాయిత్యం!

16 Year Old Schoolgirl Allegedly Raped By Facebook Friend For 4 Days

సంగారెడ్డి: స్వయానా బావే 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే నరసింహ ఇంటికి సోమవారం ఆయన మేనకొడలు వచ్చింది. అయితే, అదే రోజు సాయంత్రం నరసింహ కుమారుడు పవన్ బాలికను బైక్‌పై ఎక్కించుకొని ఐడిఎ బొల్లారం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments