Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి … రేప్

rape1

 

హైదరాబాద్: బంజారాహిల్స్ లో ఓ యువతికి కూల్ డ్రింక్ లో మత్త మందు ఇచ్చి అత్యాచారం చేశాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యువతి యాంకరింగ్ శిక్షణకు వెళ్లినప్పుడు జి. శ్రీనివాసు రావుతో పరిచయం ఏర్పడింది.  ప్రేమ  అని ఎన్ని సార్లు అతను వెంట పడినా యువతి పట్టించుకోలేదు. దీంతో తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డడని తనని చూసి వెళ్లాలని ఫోన్ లో యువతికి తెలిపాడు. యువతి శ్రీనివాసు రావు ఆపార్ట్ మెంట్ కు వెళ్లినప్పుడు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి యువతితో తాగించాడు.  యువతి నిద్రలోకి జారుకోగానే అతను అత్యాచారం చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.  కానీ అతను తనని పట్టించుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని బంజారాహిల్స్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది.

Comments

comments