Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

16 ఏళ్ల బాలికపై పోలీస్ కామాంధులు..

Minor-Rape

తిరువనంతపురం: కేరళలోని ఆలప్పజా జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఎస్సై, మరో ముగ్గురు వ్యక్తులుతో కలిసి 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బుధవారం ఎస్‌ఐతో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మారారికులం గ్రామానికి చెందిన ఆదీరా (37) అనే మహిళ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వ్యభిచార ఊబిలోకి తోసింది. అయితే ఆ బాలిక అస్వస్థతకు గురవ్వడంతో ఎలాగైన వదిలించుకోవాలని బాలికను ఆమె ఇంటి వద్ద వదిలి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో బాలిక ఎడవడంతో అనుమానం వచ్చి స్థానికులు ఆదీరాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.పోలీసుల విచారణలో మారారికులమ్ పోలీస్టేషన్‌లో ఎస్‌ఐతోపాటు డ్రగ్స్ విభాగం అధికారి థామస్, ప్రిన్స్, జీను బాలికపై అత్యాచారం చేశారని ఆదీరా తెలిపింది. దీంతో పోలీసులు నలుగురితోపాటు ఆదీరాను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Comments

comments