Search
Wednesday 14 November 2018
  • :
  • :

దివ్యాంగ బాలికపై అఘాయిత్యం

rape1గుంటూరు: దివ్యాంగ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… చిలువూరు గ్రామానికి చెందిన బాలిక ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లింది. దీంతో ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మాయిని నిమ్మతోటలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కుమార్తె తిరిగి రాకపోవడంతో వెతుకుంటూ ఆమె తల్లి వెళ్లింది. అనుమానంతో తోట వైపు వెళ్లగా కూతురు కంటపడిన దారుణమైన దృశ్యంతో ఖిన్నురాలైంది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దాంతో కుటుంబీకులు స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్‌ఐ ఎం.మురళి కేసు నమోదు చేసి, బాలికను వైద్యపరీక్ష నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. పోలీసులు గాలింపు చేసి నిందితుడిని  అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Comments

comments