Home జాతీయ వార్తలు తుపాకీతో బెదిరించి…

తుపాకీతో బెదిరించి…

Gang rapeలక్నో : తుపాకీతో బెదిరించి ఓ బాలికపై నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. ఈ ఘటన యుపిలోని ముజఫర్ నగర్ జిల్లా మన్ సూర్ పూర్ గ్రామంలో శనివారం ఉదయం జరిగింది.  పశువులకు మేత సేకరించేందుకు పచ్చిక మైదానానికి వెళ్లిన బాలికను బలవంతంగా దగ్గరలోని చెరుకు తోటలోకి నలుగురు దుండగులు తీసుకెళ్లారు. తుపాకీ చూపించి చంపేస్తామని బెదిరించి ఆ బాలికపై  అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు బాధిత బాలిక కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Rape on Girl at UP