Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఒంటరి మహిళపై అత్యాచారం

SARITA

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పరిధిలో ఓ ఒంటరి మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగగా, బుధవారం వెలుగులోకి వచ్చింది. ఒంటరి మహిళను ప్రతాప్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆమె అతడికి లొంగకపోవడంతో బాధితురాలి బిడ్డను ప్రతాప్ కిడ్నాప్ చేశాడు. బిడ్డ కోసం వచ్చిన బాధితురాలిపై ప్రతాప్ అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆమె ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ ఇరవై రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది. మూడు లక్షలు తీసుకుని ప్రతాప్‌తో రాజీ పడాలని పోలీసులు తనను బెదిరించారని ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయంపై ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Rape the Woman in Peddapally

Comments

comments