Home జాతీయ వార్తలు ఆర్ఎఎఫ్ జవాను కాల్చివేత

ఆర్ఎఎఫ్ జవాను కాల్చివేత

Jawanపాట్నా : బీహార్ లో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. పట్టపగలే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్) జవాను సుధీర్ కుమార్ మాంఝీని కాల్చి చంపారు. ముజఫర్ పూర్ జిల్లా ఖాజి మహ్మద్ పూర్ తానా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. తానా ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్న సుధీర్ కుమార్ తో బైక్ పై వచ్చిన దుండగులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఓ దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో సుధీర్ కుమార్ పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సుధీర్ కుమార్ ను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఘటనాస్థలిలో సిసి టివి పుటేజీలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ముజఫర్ పూర్ ఎఎస్ పి మనోజ్ మీడియాకు తెలిపారు. పోస్టుమార్టం కోసం సుధీర్ కుమార్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Rapid Action Force jawan shot dead in Muzaffarpur