Search
Saturday 22 September 2018
  • :
  • :

పేంటెంట్ కోసం రస‘గోల’

RASAGULLA12భువనేశ్వర్: రసగుల్లాను చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఇలా నోట్లే వేసుకుంటే అలా కరిగిపోయే రసగుల్లా అంటే బహుశా ఇష్టపడని వారుండరు. రసగుల్లా ఎక్కడ పుట్టింది, దీనికి ప్రాచుర్యం కల్పించిందెవరు అనే విషయంలో ఇప్పుడు మల్లగుల్లాలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య ఈ రసగోల మొదలైంది. రసగుల్లా స్వీటు పూరీలో పుట్టిందని ఒడిశా సర్కార్ ఢంకా బజాయిస్తోంది. అదేం కాదు…కోల్‌కతాలోనే పుట్టిందని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వాదిస్తోంది. రసగుల్లాపై పేటెంట్ తమదంటూ తమదేనంటూ రెండు రాష్ట్రాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ వివాదం కాస్తా మరింత ముదరక ముందే ఓ కమిటీ వేస్తే ఎలా ఉంటుందని ఆలోచించిన ఒడిశా ప్రభుత్వం ఆ ఆలోచనను వెంటనే కార్యరూపంలోకి తెచ్చింది. రసగుల్లా గుట్టు తెలుసుకునేందుకు ఒక కమిటీని వేసింది. రసగుల్లా పుట్టుపూర్వోత్తరాలు, అసలు వాస్తవాలు ఏమిటనేవి తెలుసుకునేందుకు ఏకంగా మూడు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు ఒడిశా మంత్రి ప్రదీప్ పాణిగ్రాహి తెలిపారు. పరిశ్రమలు, సాంస్కృతిక విభాగానికి చెందిన వ్యక్తులతో ఏర్పాటు చేసే ఈ కమిటీలు వారంలోగా నివేదికలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.

Comments

comments