Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి…

rashi

సినిమాల మధ్య గ్యాప్‌లో విదేశాల్లో హాలిడే టూర్‌ను ఎంజాయ్ చేస్తుంటారు పలువురు అందాల తారలు. అయితే ఒక హీరోయిన్ మరో హీరోయిన్‌తో కలిసి కూడా టూర్లకు వెళ్తున్నారు.  తాజాగా యంగ్ బ్యూటీ రాశీఖన్నా కూడా అదే తరహాలో ప్లాన్ చేసుకుంది. మరో హీరోయిన్‌తో కలిసి హాలిడే టూర్‌కు వెళ్లనుంది ఈ భామ. రాశీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే ఆమె కొందరు బాలీవుడ్ హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటుంది. హీరోయిన్ వాణీకపూర్‌ను అమ్మడు తరచు కలుస్తూ ఉంటుంది. ఈసారి ఆమెతో కలిసి హాలిడే టూర్‌ను ఎంజాయ్ చేయడానికి డేట్ సెట్ చేసుకుంది. ఇప్పటివరకు చాలా దేశాలు తిరిగొచ్చిన రాశి ఈసారి సింగపూర్‌ను ఎంపిక చేసుకుంది. బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్‌కు కూడా దేశాలు తిరిగి రావడమంటే చాలా ఇష్టం. ఆమె తరచుగా బాలీవుడ్ భామలతో కలిసి హాలిడే టూర్లకు వెళ్తుంది. ఇక ఈసారి స్పెషల్‌గా రాశీ చెప్పగానే అమ్మడు ఓకే చేసి సింగపూర్‌కు ప్రయాణానికి సిద్ధమైంది. ఇక రాశిఖన్నా చివరగా ‘తొలిప్రేమ’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె నితిన్‌తో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తోంది.

Comments

comments