Home స్కోర్ ఐయామ్ ది మోస్ట్ పాపులర్: రషీద్ ఖాన్

ఐయామ్ ది మోస్ట్ పాపులర్: రషీద్ ఖాన్

Rashid Khan says may be I am Most Popular Person in Afghanistan

ముంబయి: దాదాపు 50 రోజులకు పైగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపిఎల్ పదకొండో సీజన్ గత ఆదివారంతో ముగిసింది. చెన్నై సూపర్‌కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో భారత యువ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్‌లతో పాటు ఆఫ్గాన్ యువసంచలనం రషీద్ ఖాన్ తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కానీ రషీద్ మాత్రం బాగా పాపులర్ అయ్యాడు. రషీద్ ఖాన్ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ఐపిఎల్ లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో  రషీద్ క్రికెట్ అభిమానులను కట్టిపడేశాడు. గత శుక్రవారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్-2 మ్యాచ్‌లో రషీద్ చేసిన అద్భుత ప్రదర్శనపై ప్ర‌శంస‌ల వర్షం కురిసింది. సోష‌ల్ మీడియా ద్వారా ర‌షీద్‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. తన ఆల్‌రౌండర్‌ ప్రదర్శన కారణంగా ఒంటిచేత్తో ఎస్ఆర్ హెచ్ కు అద్భుత విజయాన్ని అందించి ఫైనల్ కు తీసుకెళ్లాడు. అయితే ఫైనల్లో హైదరాబాద్ జట్టు ఓటమి పాలై టైటిల్ చేజార్చుకుంది.

కానీ రషీద్ తన ఆటతీరుతో భారత క్రికెట్ అభిమానులను ఫిదా  చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో కొందరు అభిమానులు ఏకంగా రషీద్‌కు భారత పౌరసత్వం ఇచ్చి, టీమిండియాలోకి తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందకేసి రషీద్‌కు భారత పౌరసత్వం ఇప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు. దీనిపై సుష్మాతో పాటు, అఫ్ఘాన్ అధ్యక్షుడు కూడా స్పందించిన విషయం తెలిసిందే. తమ ఆటగాడిని ఎవరికి ఇచ్చేది లేదని, అతడు మా క్రికెట్ కు దొరికిన ఆణిముత్యం అని కొనియాడారు. అతడి ప్రదర్శనతో మా దేశాన్ని గర్వపడేలా చేశాడని అఫ్ఘాన్ అధ్యక్షుడు ప్రశంసించారు.

ఇదిలాఉండగా రషీద్‌ను విలేకర్లు భారత్‌లో క్రికెటర్ల పాపులారిటీ ఏంటో చూస్తూనే ఉన్నారు. మరి ఆఫ్గానిస్థాన్‌లో కూడా ఇలాంటి గుర్తింపే ఉంటుందా అని ప్రశ్నించగా… ‘ఇప్పటివరకు తెలిసింది ఏమిటంటే మా దేశ అధ్యక్షుడి తర్వాత ఆఫ్గాన్‌లో మోస్ట్ పాపులర్ వ్యక్తిని నేనేనేమో’ అని నవ్వుతు బదులిచ్చాడు.