Home సినిమా దారి మళ్లిన రేష్మీ .. కర్నూల్ వెళ్లబోయి కరీంనగర్‌కు…

దారి మళ్లిన రేష్మీ .. కర్నూల్ వెళ్లబోయి కరీంనగర్‌కు…

Rashmi-Gautamఈటివిలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో రేష్మీ గౌతమ్ యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామకు అంత గుర్తింపు రాలేదు. కాగా ఈ ఒక్క షోతో బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా ఫుల్ బిజీ అయిపోయింది రేష్మీ. కాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సిన రేష్మీ చాలా ఆలస్యంగా వెళ్లింది.
అందుకు ఆమె చెప్పిన కారణం అక్కడి వారందరిని ఆశ్చర్యపరిచింది. కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లాల్సిన రేష్మీ పొరపాటున కరీంనగర్‌కు వెళ్లిందటా.. కారు డ్రైవర్‌ను కర్నూలు తీసుకెళ్లమంటే కరీంనగర్‌కు తీసుకెళ్లాడని, దీంతో కార్యక్రమానికి రావడం అలస్యమైందని ప్రేక్షకులకు సారీ చెప్పింది. అనంతరం అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని పలు పాటలకు డ్యాన్స్ చేసింది.