Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

చివరి రెండు రీల్స్‌లో భయపడతారు

Rashmi Gautam Speech at Anthaku Minchi Movie Trailer

ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యు అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పించిన చిత్రం ‘అంతకు మించి’. జై, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 24న విడుదలకానుంది. ఈ సినిమా టైటిల్ సాం గ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశా రు. ఈ సందర్భంగా దర్శకుడు జానీ మాట్లాడుతూ “దర్శకుడిగా నా తొలి చిత్రమిది. సినిమా పోస్టర్స్ విడుదలైన తర్వాత అందరూ రష్మీ ఎక్స్‌పోజింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సిని మా విడుదలైన తర్వాత ఆమె పర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారు. హీరో జై తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించారు. సునీల్ అద్భుతమైన సంగీతాన్ని అం దించారు”అని అన్నారు. హీరో, నిర్మాత జై మాట్లాడుతూ “సినిమా చివరి రెండు రీల్స్‌లో ప్రేక్షకులు ఖచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో టైటిల్ పడుతుంది. ‘అంతకు మిం చి’ టైటిల్ ఎందుకు పెట్టారని అప్పుడు అర్థమవుతుం ది. రష్మీ తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ఆ మె వల్లనే సినిమాకు హైప్ వచ్చింది”అని పేర్కొన్నారు. హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ “సినిమా కేక్‌లా డిఫరెంట్ ఫ్లే వర్స్‌లో ఉంటుంది. సినిమా కోసం అం దరం చాలా కష్టపడ్డాం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Comments

comments