Home సినిమా హాట్ ఇమేజ్ కోసమే…

హాట్ ఇమేజ్ కోసమే…

rashmi goutham in anthaku minchi movie

ముందు బుల్లితెరపై కొంచెం పేరు తెచ్చుకొని ఆతర్వాత సినిమాల్లో నటించి పాపులారిటీ తెచ్చుకుంటారు చాలా మంది అమ్మాయిలు. కానీ రష్మి గౌతమ్ మాత్రం దీనికి రివర్స్. ముందు ఆమె సినిమాల్లో నటించింది కానీ అక్కడ సరైన బ్రేక్ రాలేదు. దీంతో ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్‌కు యాంకర్ అయింది. అక్కడ ఆమెకు తిరుగులేని పేరొచ్చింది. ఈ పాపులారిటీతో మళ్లీ సినిమా అవకాశాలు అందుకుంది. అయితే మొదట్లో మాదిరి సైడ్ క్యారెక్టర్లు చేయకుండా ‘గుంటూరు టాకీస్’ సినిమాలో ప్రధాన కథానాయికగా నటించిన రష్మి… ఇందులో హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో రష్మీకి మంచి అవకాశాలు వచ్చాయి. కానీ వచ్చిన అవకాశాల్లో సరైనవి ఎంచుకోవడంలో ఆమె ఫెయిలైంది. ఆ తర్వాత ఆమె చేసినవన్నీ తన హాట్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించినవే తప్ప మంచి విషయం ఉన్నవేవీ లేవు. దీంతో రష్మి ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది. తాజాగా ఈ భామ నటించిన ‘అంతకుమించి’ అనే సినిమా వచ్చింది. ఇది కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.