Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

విజయ్‌‌ సరసన రష్మిక

Vijay-Rashmika

‘అర్జున్ రెడ్డి’… ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ లో బర్నింగ్ టాపిక్.. విపరీతమైన క్రేజ్.. అదేస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఘన విజయం సాధించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక.. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే పెళ్లిచూపులు చిత్రంతో మంచి హీరోగా గుర్తింపు పొందిన విజయ్, అర్జున్ రెడ్డితో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

దీంతో విజయ్ కి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ గీతా ఆర్ట్స్ బ్యానర్-2 బ్యానర్ లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కన్నడలో సూపర్ హిట్ సాధించిన ‘కిరిక్ పార్టీ’ సినిమా హీరోయిన్ రష్మిక మంధన హీరోయిన్ గా నటించనుంది. ఈ విషయాన్ని రష్మిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ తో పాటు చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అల్లు అరవింద్, బన్ని వాస్ లకు ధన్యవాదాలు’ అంటూ రష్మిక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ని విజయ్ ‘వెల్ కం టూ ద బోర్డ్.. ఇద్దరం కలిసి ఓ కిర్రాక్ మ్యాజిక్ చేద్దాం’ అంటూ రీట్వీట్ చేశాడు.

ఒకే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నటీనటులు ఇద్దరు కలిసి ఒకే సినిమా చేస్తుండటంతో అభిమానులకు సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.  త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.

Comments

comments