Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

గజ్వేల్ లో రేషన్ డీలర్ ఆత్మహత్య యత్నం

Ration Dealer Sucide Attempted In Medak District

గజ్వేల్: సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో తీవ్ర మనస్థాపానికి గురైన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ రేషన్ డీలర్ వజీర్ ఖాన్ శుక్రవారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం సృష్టించింది. శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులకు నిరసనగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రేషన్ డీలర్లు ధర్నాకు కూర్చున్నారు. అదే సమయంలో ధర్నాకు హాజరైన వజీర్ ఖాన్ ఉన్నట్టుండి ఒంటిపై కరోసిన్ పోసుకుని న్పింటించుకున్నాడు. అదృశ్యం చూసిన పలువురు డీలర్లు వెంటనే మంటలు ఆర్పే పప్రయత్నం చేశారు. సమీపంలో ఉన్న హోటల్ నుంచి నీళ్లు తెచ్చి వజీర్‌ఖాన్ పై పోయటంతో మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ అప్పటికే చేతుల, కాళ్లు ముఖం కాలిపోయ గాయాల పాలయిన వజీర్ ఖాన్‌ను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక చిత్స అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ  వజీర్ ఖాన్ ఆత్మహత్యకు పాల్పడటం రేషన్ డీలర్ల మనో వేధనకు అద్దం పడుతున్నదని ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను నెర వేర్చటంతో పాటు పుత్తర్వులను ఉపసంహారించుకోవాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ గజ్వేల్ మండల అధ్యక్షుడు గులాం అజీజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, నాయకులు రవీందర్, కుమార్, కిషోర్ తదితరులు కోరుతున్నారు. సంఘటన జరిగిన వెంటనే పలువురు కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డితో పాటు పలువుఉ నాయకులు వజీర్ ఖాన్ పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డీలర్ల సమస్యను పరిష్కరించాల్సింది పోయి మొండిగా వ్యవహరించటం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని వారన్నారు.

Comments

comments