Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Ration Dealers Demond Recognized As A Govt Employee

మన తెలంగాణ/మహబూబాబాద్ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలందిస్తున్న రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉ ద్యోగులుగా గుర్తించాలని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు మారెని దామోదర్, కార్యదర్శి బిర్రు వెంకట్‌నారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టి రిలే నిరాహారదీక్షలకు వారు హాజరై మాట్లాడారు. డీలర్ వృత్తిని న మ్ముకుని వేలాది కుటుంబాలు ఏళ్ల తరబడి కష్టపడి ప్ర జ లకు సేవలందిస్తున్న ప్రభుత్వం మాత్రం డీలర్ల సేవలను గుర్తించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం డీలర్లకు న్యాయం చేయకపోతే వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. డీలర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించని పక్షంలో గౌరవ వేతనంగా నైనా నెలకు రూ.30 వేలు ఇవ్వాలన్నారు. హెల్త్‌కార్డు లు, ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో కోశాధికారి ఎండి. సర్వర్, డీలర్లు భాను శంకర్‌నాయక్, ఏలియా, కిషన్‌నాయక్, యాకయ్య, రాంబాబు,జనార్థన్,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
నర్సింహులపేటః రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతూ మండల రేషన్ డీలర్ల ఆ ధ్వర్యంలో గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాల యం ఎదుట డీలర్లు రిలేదీక్షలను చేపట్టడం జరిగింది. డీలర్ల దీక్షకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్లసంఘం మండల అ ధ్యక్షుడు గడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించి కనీస వేతనం 30 వేలు చెల్లించాలని గత 4 సంవత్సరములుగా ప్రభుత్వానికి పలు పర్యాయములు విన్నవించినను స్పందన రాకపోవడం విచారకరం అన్నారు.అందుకు నిరసనగా రిలే ని రహార దీక్షలను చేపట్టడం జరిగిందన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు కనీస వేతనంతో పాటు హె ల్త్‌కార్డులు,డబుల్ బెడ్‌రూంలు నిర్మించాలని వారు ప్ర భుత్వన్ని డిమాండ్ చేశారు.తమ సమస్యలును పరిష్కరించకుంటే జూలై 1వ తేదీ నుంచి రేషన్ షాపులను బం ద్ చేయనున్నట్లు ఆయన ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మారెడ్డి,రేషన్ డీల ర్ల మండల సంఘం ఉపాధ్యక్షుడు గుండాల బిక్ష ం,బోబ్బ పద్మ,ప్రదాన కార్య దర్శి వీరాస్వామి,కో-శాధికారి శ్రీధ ర్,గౌరవ సలహదారు విజయ,సభ్యులు పో న్నంప్రభాకర్,దేవయ్య,అరుణ,తదితరులుపాల్గొన్నారు.

Comments

comments