Home ఆదిలాబాద్ రేషన్ డీలర్లు ఒంటి కాలుపై నిరసన

రేషన్ డీలర్లు ఒంటి కాలుపై నిరసన

Ration dealers Protest against the shit

మామడ:  రేషన్ డీలర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్షం చేయడంతో శుక్రవారం మండల కేంద్రంలో డీలర్లు ఒంటి కాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు మౌలానా మాట్లాడుతూ దేశంలోనే అన్నీ రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కమీషన్‌లు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రేషన్ డీలర్లు ప్రతీ ఒక్కరికి నెలకు 30 వేల గౌరవ వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని ఎడల అందోళన ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాలలోని రేషన్ డీలర్లు పాల్గొన్నారు.