Home సిద్దిపేట సమస్యలు తీర్చకుంటే నిరవధిక సమ్మె

సమస్యలు తీర్చకుంటే నిరవధిక సమ్మె

 Ration Dealers Do Strike For Their Salary increment

మనతెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : రేషన్ డీలర్లలకు  కనీస గౌరవ వేతనం ప్రకటించడంతో పాటు  గతంలో రావల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు పద్మభాస్కర్‌రెడ్డి, వంగరి నాగరాజు, నాగభూషణంలు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో జరిగిన ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్ , డీఎస్‌వో వెంకటేశ్వర్లకు వినతి పత్రం ఇచ్చి మాట్లాడారు.  రేషన్ డీలర్లు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని  ప్రభుత్వం సైతం తమ సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు.  గత బకాయిలు చెల్లించకుంటే  డీడీలు కట్టకుండా జూలై 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామన్నారు. రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఏ కార్యక్రమం ప్రకటించినా చేపట్టడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఈకార్యక్రమంలో  నాయకులు  మోనయ్య, కూరప్రభాకర్, సత్తయ్య, శ్రీనివాస్, ప్రకాశ్, యాదగిరి, వెంకటేశం, తదితరులు ఉన్నారు.