Search
Friday 20 July 2018
  • :
  • :
Latest News

కలెక్టరేట్ ముందు రేషన్ డీలర్ల సంఘం ధర్నా

Ration Dealers Strike In Front Of Collectorate

భూపాలపల్లి ఃజయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గర్తించాలని వారికి ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆద్వర్యంలో మంగళ వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడించి అర్థ నగ్న ప్రదర్శన చేసి వారి నిరసనను తెలియజేశారు.అనంతరం భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై ధర్నా ,రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట పాటు వాహనాలు నిలిచి పోయాయి. స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి ధర్నాను విరమింపజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది.వారికి మద్ధతుగా వివిధ పార్టీల నాయకులు పాల్గోని వారికి సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.బిజెపి జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య మాట్లాడుతూ..రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తక్షణమే వారికి ఇచ్చిన నోటీసులను రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.డీలర్ల ధర్నా కార్యక్రమానికి మద్దతుగా వారి న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలంటు జిల్లా కేంద్రలోని కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్నధర్నాకార్యక్రమానికి మద్దతుగా వైఎస్సార్ సిపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అప్పం కిషన్ మద్దతు తెలిపి సంఘీబావాన్ని తెలిపారు. ఈసందర్భంగా కిషన్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్ల న్యామైన డిమాండ్‌లను పరిష్కరించేవరకు వైఎస్సార్ సిపి వారికి అండగా ఉంటుందని అన్నారు. వైఎస్సార్ హయాంలో రేషన్ షాపుల్లో ఉప్పుతో  సహా తొమ్మిది రకాల సరుకులు అందించేవారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రేషన్ షాపులు కాస్తా బియ్యం షాపులుగా మారాయని ఆయన విమర్శించారు.డీలర్లకు ఇచ్చిన సోకజ్ నోటిసులను రద్దు చేయాలన్నారు.ఇతర రాష్ట్రాల్లో డీలర్లకు వేతనాలు ఇస్తున్నారని అలాగే బడ్జెట్‌లో దనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నా కేసీఆర్ డీలర్లకు ఇవ్వాడానికి చేతులు రావడంలేదని ప్రశ్నించారు. కేవలం రేషన్ షాపులో బియ్యానికి మాత్రమే పరిమితమైనాయని విమర్శించారు.ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీసం 30 వేల వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాధకృష్ణ,ప్రసాద్,అన్ని మండలాల,గ్రామాల డీలర్లు పాల్గొన్నారు.

Comments

comments