యైటింక్లయిన్‌కాలనీ: అక్రమంగా తరలించేందుకు సిద్దంగా ఉన్న రేషన్ కిరోసిన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీసు కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఎసిపి విజయసారధి ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు దాడి చేసి కిరోసిన్‌ను తరలించేందుకు సిద్దంగా ఉన్న లారీని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… రామగిరి మండలం సుందిల్ల గ్రామ పొలిమేరలోని ఊట్ల రాజిరెడ్డి పౌల్ట్రిఫామ్లో రేషన్ కిరోసిన్‌ను డ్రమ్ముల నుంచి ఏపి28ఎక్స్-6430 నంబర్ గల లారీలోకి లారీ డ్రైవర్లు లక్కాకుల తిరుపతి, మహ్మద్ మొయిజ్లు కలిసి మోటార్ సహయంతో డ్రమ్ముల నుంచి లారీల్లోకి ఎక్కిస్తుండగా పట్టుకోవడం జరిగింది. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు డ్రమ్ముల్లోని 1100 లీటర్ల నీలి కిరోసిన్‌ను సైతం పోలీసులు స్వాదినం చేసుకున్నారు. పట్టుకున్న నీలి కిరోసిన్ విలువ 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు డ్రైవర్లతో పాటు ఆఫ్ హెచ్‌పి మోటార్, సబ్సిడి నీలి కిరోసిన్‌ను గోదావరిఖని టూటౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఎస్ఐ జూపల్లి సతీష్రావ్కు అప్పగించారు. ప్రభుత్వ పథకాలైన రేషన్ బియ్యం, నీలి కిరోసిన్ ప్రక్కదారి పడితే సహించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎసిపి తెలిపారు. దాడిలో సిఐ సరిలాల్, సిబ్బంది సదానందంగౌడ్, నిజాంపేట్శేఖర్, రవికుమార్, మహేందర్, సదానందం, చంద్రశేఖర్ పాల్గోన్నారు.