Home మంచిర్యాల పక్కదారి పడుతున రేషన్ బియ్యం

పక్కదారి పడుతున రేషన్ బియ్యం

Ration

మంచిర్యాలప్రతినిధి:  పేదలకు చెందాల్సిన బియ్యం పెద్దల పరమవుతున్నాయి. అన్నముద్దలు కావాల్సిన బియ్యం అంగడి సరుకుగా మారాయి. ప్రభుత్వానికి భారమైనా నిరుపేదల కోసం భరిస్తూ కోట్లాది రూపాయాలు ఇస్తున్న సబ్సిడీ బియ్యం అక్రమార్కులకు మహారాష్ట్రంలో చక్కడి రాబడి ఇస్తున్న వ్యాపారంగా మారడం గమనార్హం. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న మంచిర్యాలజిల్లా, కొమురంభీం(ఆసిఫాబాద్) జిల్లాల ప్రాంతాల నుంచి ప్రతినిత్యం రేషన్ బియ్యం రైలు మార్గాన మహారాష్ట్రకు తరలి పోతున్నాయి.

ప్రధానంగా రైలుమార్గాన ఎక్కువ రవాణా జరుగుతు ండగా రోడ్డు మార్గంలో కూడా ఈ రవాణ జోరుగా సాగుతుంది. రేషన్ దుకాణాలలో ఇచ్చే రూ.1 కిలో బియ్యాన్ని చాకచక్యంగా బ్లాక్ మార్కె ట్‌కు తరలించి రూ. 16 నుంచి 20 లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుం టున్నారు. జిల్లాలోని పలు రైల్వేస్టేషన్ల ద్వారా రైళ్లలో మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు రవాణా చేస్తున్న తీరుపై “మన తెలం గాణ” నిఘా పెట్టి బియ్యాన్ని ఏ విధంగా రవాణా చేస్తున్నారో పరిశీ లించింది.

అక్రమ రవాణా సాగుతుంది ఇలా

బియ్యం అక్రమ రవాణాకు రైలు మార్గాన్ని ఎంచుకున్న దళారులు, వ్యా పారులు , గ్రామాల్లో తిరుగుతూ సేకరించిన బియ్యాన్ని గోనె సంచులు తీసి, ఎవరికి అనుమానం రాకుండా ప్లాస్టిక్ సంచుల్లో నింపి అక్రమ రవాణకు స్ధ్దిం చేస్తున్నారు. అనంతరం ఈ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించేందుకు రైలు మార్గాన కొన్ని రైల్వే స్టేషన్లు ఎంచుకుంటారు. మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిన్‌రోడ్డు (తాండూర్), ఆసిఫాబాద్‌రోడ్ (రెబ్బెన), కాగజ్‌నగర్, సిర్పూర్ రైల్వే స్టేషన్ల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని దళా రులు, వ్యాపారులు రేషన్ డీలర్ల నుంచి గ్రామాల్లో కిలో రూ. 10కికొని మహారాష్ట్రకు సరఫరా చేస్తూ అక్కడ రూ. 18 నుంచి 20లకు అమ్ము కొని సొమ్ము చేసుకుంటున్నారు.

బియ్యం కొనుగోలు చేసిన అనంతరం రాత్రి నాగ్‌ఫూర్ ఫ్యాసింజర్, భాగ్యనగర్ రైళ్లతో పాటు ఉదయం రామగరి ఫ్యాసింజర్ రైళ్లో మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని తరలిస్తు న్నారు. రాత్రిళ్లు 10 గంటల తరువాత ఈ రైళ్లు ఉండడంతో అక్రమా ర్కులకు మార్గం సులభం అవుతోంది. రాత్రిపూట స్టేషన్ వద్దకు బియ్యాన్ని తరలించి ప్లాట్ ఫారంలపై బియ్యం సంచులు ఉంచి దూరం గా కూర్చుంటున్నారు. సరిగా రైలు రాగానే బోగిలోకి ఎక్కించుకొని, ప్రయాణికులు కూర్చొనే సీట్ల కింద బాత్‌రూములలో బియ్యం సంచులు ఉంచుతున్నారు.

రాత్రి ప్రయాణం కావడంతో అధికారులు సోదలు నిర్వహించకపోవడం. ఒక వేల అధికారులు తనిఖీలు చేసిన సిబ్బంది మామూళ్లకు ఆశపడుతుండడంతో రైళ్లలో సాఫిగా మహరాష్ట్రకు తరలిస్తున్నారు. ఇలా అక్రమంగా చేరవేసిన బియ్యాన్ని మహారాష్ట్ర లోని వీరూర్ గ్రామంలోని దళారులు వెంటనే కొనుగోలు చేస్తున్నారు. క్వింటాళ్లకు రూ. వెయ్యి చొప్పున కొనుగోలు చేసిన బియ్యాన్ని వీరూ ర్‌లో రూ. 1800 నుండి 2000 వరకు అమ్ముతుండడంతో క్వింటాల్‌కు ఖక్చులు పోను 600 నుండి 800 వరకు లాభం పొందుతున్నారు. ఈ బియ్యం అక్రమ రవాణా చేసేందుకు ప్రత్యేక వ్యక్తులతో పాటు వాహ నాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ దందా సాగిస్తున్నారు.

బియ్యాన్ని పట్టుకున్నారు సరే…. అక్రమార్కులు ఎక్కడా?

రైళ్ల ద్వారా రేషన్ బియ్యాన్ని పలు రైల్వే స్టేషన్ల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అయితే ప్రతి రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులతో పాటు డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కేవలం ఎక్కువగా బియ్యాన్ని మా త్రం పట్టుకుంటున్నారు. కాని బియ్యాన్ని చేరవేసే అక్రమార్కులను పట్టుకోకపోవడంతో ఈ దందా నిర్వీరామంగా కొనసాగుతూనే ఉంది. రైల్వే స్టేషన్ల ద్వారా బియ్యం అక్రమ రవాణకు పాల్పడే వ్యక్తులు సంబం ధిత రైల్వే స్టేషన్‌లోని సిబ్బందితో పాటు పోలీసును మచ్చిక చేసు కుంటున్నారు.

రైలు ద్వారా రేషన్ బియ్యాన్ని అక్రమంగా చేరవేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైన సమాచారం అందిస్తేనే దాడులు చేస్తూ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారే తప్పా అక్రమార్కులు ఎవరని ఆరా తీయకపోవడం, అక్రమార్కులను పట్టుకోకపోవడంతోనే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయలేకపోతున్నారు.