Home తాజా వార్తలు రౌడీషీటర్ దారుణ హత్య

రౌడీషీటర్ దారుణ హత్య

MURDERహైదరాబాద్: నగరంలోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోగల టికల్‌కుంట ప్రాంతంలో మంగళవారం ఉదయం రౌడీషీటర్ ఫిరోజ్‌ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లు మహమ్మద్ ప్రూట్, ఆసిఫ్, బాబాఖాన్‌లతో ఉన్న పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.