Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

రౌడీషీటర్ హత్య

murderపశ్చిమగోదావరి : ఏలూరు నగరంలో గురువారం ఉదయం ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కొత్తపేటకు చెందిన రౌడీషీటర్ కంచి పెదకృష్ణ(50) తన సహచరులతో కలిసి బైక్‌పై వస్తుండగా చింతచెట్టు సెంటర్‌లో ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణ సంఘటనాస్థలంలోనే చనిపోయాడు. కృష్ణ పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. టుటౌన్ సిఐ బంగార్రాజు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని సిఐ తెలిపారు.

Comments

comments