Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

బాలీవుడ్ నటిపై కేసు..

BOLLYWOOD-ACTERS

ముంబయి: నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించినందకు బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై  కేసు నమోదు అయింది. ఒడిశాలోని లింగరాజ ఆలయంలో అడ్వర్‌టైజ్‌మెంట్ షూటింగ్ జరిపే క్రమంలో ఆలయ  నిబంధనలను అతిక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఆ ఆలయంలో కెమెరాలను అనుమతి లేదని ఆలయ అధికారులు అంటున్నారు. అలాంటి ప్రదేశంలో యాడ్ షూటింగ్ చేయడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు  చేశారు. అయితే రవీనా మాత్రం ఈ ఆరోపణలు సరికాదని చెప్పుకోస్తుంది. వాస్తవానికి అక్కడ యాడ్ ఏజెన్సీ లేదు. యాడ్ షూటింగే  జరపలేదు. అక్కడి మీడియా, అభిమానులు తమ చరవాణిల్లో సెల్ఫీలు తీసుకున్నరని ఆమె వెల్లడించింది. అయినా అక్కడ ఫోన్లకు అనుమతిలేదన్న విషయం తనకు తెలియదని పేర్కొంది.

Comments

comments