Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

‘ అదుగో ’ ఫస్ట్‌లుక్ రిలీజ్

Ravi babu ADHUGO First Look Release

హైదరాబాద్ : వైవిధ్యమైన కథలతో తెలుగు వెండి తెరపై సందడి చేసే ప్రముఖ దర్శకుడు, నటుడు రవి బాబు తెరకెక్కిస్తున్న ‘ అదుగో ’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తెలుగు తెరపై నటుడిగా, దర్శకుడిగా రవి బాబుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అల్లరి, లడ్డూబాబు వంటి కామెడీ సినిమాలతో పాటు నచ్చావులే వంటి ప్రేమకథాచిత్రం, అవును, అనసూయ, అమరావతి వంటి హారర్ చిత్రాలను ఆయన రూపొందించారు. ఇప్పుడు ఆయన పంది పిల్లను ప్రధాన పాత్రలో చూపిస్తూ అదుగో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ పాత్రలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పంది పిల్ల తనను తాను పరిచయం చేసుకుంటున్నట్టుగా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. అయితే పంది పిల్లతో రవిబాబు చేసిన ప్రయోగం ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే.

Ravi babu ADHUGO First Look Release

Comments

comments