Search
Sunday 18 November 2018
  • :
  • :

మానసిక పరిస్థితి బాగానే ఉందా? అన్నారు

Ravi-Babu

ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అదిగో’. పంది పిల్లను లీడ్ రోల్‌గా చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమలో జంతువులతో తీసిన సినిమాలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. తమిళంలో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది. పంది పిల్లతో ఈ సినిమా చేసిన రవిబాబు ఓపికను చూసి మెచ్చుకోవాల్సిందే. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో లవ్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ ‘అదిగో’. పిల్లలకు బాగా నచ్చుతుంది ఈ చిత్రం. త్వరలో ఆడియో విడుదల చేసి సినిమాను వేసవిలో విడుదల చేస్తాం”అని తెలిపారు. రవిబాబు మాట్లాడుతూ “పందిపిల్లతో సినిమానా? మానసిక పరిస్థితి బాగానే ఉందా? అంటూ చాలా మంది నాతో అన్నారు. ఈ సినిమా రెండున్నరేళ్ల క్రితం మొదలైంది. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటంతో సినిమాకు ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్ పూర్తయింది”అని అన్నారు. అభిషేక్ వర్మ, నాభ నటేష్, రవిబాబు, టి.ఉద్యభాస్కర్, ఆర్.కె.వీరేందర్ చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేః సత్యానంద్, డైలాగ్స్‌ః రవిబాబు, నివాస్, పాటలుః భాస్కరభట్ల, కెమెరాః సుధాకర్ రెడ్డి, సంగీతంః ప్రశాంత్ విహారి.

Comments

comments