Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఐసిసి పదవికి రవిశాస్త్రి రాజీనామా

ravi-shastriన్యూఢిల్లీ : టీమిండియా ప్రధాన కోచ్ పదవి ఆశించి భంగపడ్డ భారత క్రికెట్ మాజీ కెప్టెన్, టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి అంతర్జాతీయ క్రికెట్ కమిటీ(ఐసిసి)లో ఉన్నత పదవికి శుక్రవారం రాజీనామా చేశాడు. గత ఆరు సంవత్సరాల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కమిటీ(ఐసిసి)లో రవిశాస్త్రి మీడియా విభాగ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఇదే కమిటీకి ఛైర్మన్‌గా టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన అనిల్ కుంబ్లే ఉండడం గమనార్హం. ‘నేను ఇప్పటికే ఐసిసికి నా రాజీనామా లేఖ సమర్పించాను. గత ఆరేళ్లుగా ఐసిసి పదవిలో కొనసాగుతున్నా. నాకున్న వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. వ్యాఖ్యతగా, కాలమిస్ట్‌గా, క్రికెట్ నిపుణుడిగా తదితర బాధ్యతలు నిర్వహిస్తున్న రవిశాస్త్రి తనపై పని భారం తగ్గించుకోవాలనే కోణంలోనే ఐసిసి పదవికి రాజీనామా చేసిన్నట్లు తెలుస్తుంది.

Comments

comments