Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

యుపి ఎన్నికల తర్వాత ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం: రవిశంకర్

Ravi-Shankar-Prasad

ఘజియాబాద్: ట్రిపుల్ తలాఖ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అంశం. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదివారం మాట్లాడారు. యుపి ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ విధానంపై నిషేధం విధించే అవకాశం ఉందన్నారు. ఇది మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారమని అందుకే దీనిపై నిషేధం విధించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆయన చెప్పారు.

ఈ విషయమై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మూడు అంశాలను తాము ప్రతిపాదించనున్నట్లు చెప్పుకొచ్చారు. దీనికి మతంతో సంబంధం లేదని మహిళల గౌరవానికి సంబంధించిన ఈ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. మహిళలను తగినవిధంగా గౌరవం కల్పించే ఏకైక పార్టీ బిజెపి అని మంత్రి తెలిపారు.

Comments

comments