Search
Friday 21 September 2018
  • :
  • :

రవిశాస్త్రి మరో డిమాండ్.. సచిన్ కావాలి..!

ravi-shastri

న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రిని తాజాగా మరో డిమిండ్ ను బిసిసిఐ ముందుంచారు. భారత జట్టు ప్రధాన సలహాదారుడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కావాలని ఆయన డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సచిన్ క్రికెట్‌ సలహా కమిటీ(సిఎసి)లో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బిసిసిఐ బౌలింగ్ కోచ్ గా నియమించిన జహీర్ ఖాన్ స్థానంలో భరత్ అరుణ్ ని నియమించమని రవిశాస్త్రి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే శాస్త్రి మరో డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. భారత జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో విలువైన సలహాలు ఇచ్చేందుకు అనుభవం ఉన్న ఆటగాడు కావాలని అడిగిన శాస్త్రి.. అందుకు సచిన్‌ను ఎంపిక చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

Comments

comments