Search
Wednesday 26 September 2018
  • :
  • :

టీమిండియా కొత్త కోచ్‌గా రవిశాస్త్రి?

ravishastri

ముంబయి : టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. అనిల్ కుంబ్లే స్థానంలో రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ, టీమిండియా కోచ్ విష‌యంలో మ‌రో ట్విస్ట్ ఇచ్చింది బీసీసీఐ. కోచ్ ఎంపిక‌పై ఇంకా తుది నిర్ణ‌యం జ‌ర‌గ‌లేద‌ని, క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ దీనిపై ఇంకా చ‌ర్చిస్తున్న‌ద‌ని బీసీసీఐ సీఈవో అమితాబ్ చౌద‌రి వెల్ల‌డించారు. కోచ్ ఎంపిక కోసం సోమవారం ఐదుగురికి గంగూలీ, లక్ష్మణ్, సచిన్‌లతో కూడిన సిఎసి ఇంటర్వూలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోచ్ పేరును ప్రకటించకుండా వాయిదా వేసింది. టీమిండియా కెప్టెన్ కోహ్లీతో మాట్లాడిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బిసిసిఐ పాలకుల కమిటి చైర్మ న్ వినోద్ రాయ్ కోచ్ ప్రకటనను వాయిదా వేయడాన్ని తప్పుబట్టారు.

Ravi Shastri Elect as Team India New Coach

Comments

comments