Search
Friday 21 September 2018
  • :
  • :

భారత కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు!

 అధికారికంగా బిసిసిఐకి సమర్పించిన టీమిండియా మాజీ డైరెక్టర్
 జులై 9 వరకు గడువును పొడిగించిన బిసిసిఐ
Ravi-Sastriన్యూఢిల్లీ : టీమిండియా ప్రధాన కోచ్ పదవి రేసులో ముందువరుసలో నిలిచిన భారత జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్తి అధికారికంగా తన దరఖాస్తును బిసిసిఐకి సమర్పించారు. ఈ మేరకు సోమవారం బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. కోచ్ రేసులో పలువురు క్రికెట్ దిగ్గజాలు పోటీపడుతున్న నేపథ్యంలో ఇటీవల బిసిసిఐ దరఖాస్తు గడువును జులై 9వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్‌తో కూడిన క్రికెట్ సలహాదారు కమిటీ (సిఎసి) కోచ్ పదవికి సంబంధించి ఇంటర్వూలను నిర్వహించనుంది. అయితే భారత జట్టుకు డైరెక్టర్‌గా ఆగస్టు 2014 నుంచి జూన్ 2016 వరకు సేవలు అందించిన శాస్త్రి.. కెప్టెన్ విరాట్ కోహ్లి సహా జట్టు సభ్యులతో ఆరోగ్యకరమైన అవగాహనతో మెలిగారు. ఈ నేపథ్యంలో గత ఏడాది శాస్త్రిని కాదని కుంబ్లేను గంగూలీ భారత కోచ్‌గా ఎంపిక చేయగా, ఈ సారి రవిశాస్త్రి విషయంలో సిఎసి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చర్చనీయాంశంగా మారింది.
విండీస్ మాజీ కోచ్ ఫిల్ సిమన్స్ దరఖాస్తు!
ఇప్పటికే కోచ్ పదవికి సీనియర్ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సహా టామ్ మూడీ, రిచార్డ్ పైబస్ డోడా గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ పలువురి క్రికెటర్ల పేర్లు వినిపించగా, తాజాగా ఆ జాబితాలో మరో క్రికెట్ దిగ్గజం పేరు కూడా వినిపిస్తోంది. అతడే వెస్టిండీస్ మాజీ కోచ్, ఆటగాడు ఫిల్ సిమన్స్. భారత కోచ్ పదవికి రవిశాస్త్రితో పాటు సిమ్మన్స్ కూడా దరఖాస్తును పంపినట్టు బిసిసిఐ అధికారి వెల్లడించారు. విండీస్‌తో అసోసియేషన్ సమయంలో కోచ్‌గా, ఆటగాడిగా ఫిల్ ఎన్నో విజయాలు సాధించాడు. డబ్లుఐసిబికి ముందు సిమన్స్ నేతృత్వంలో వరల్డ్ టి20లో విండీస్ విజయం సాధించింది. కోచ్ పదవికి దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఎంపికైన అభ్యర్థుల పేర్లను తుది జాబితాలో వెల్లడిస్తామని బిసిసిఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఛాంపియన్ ట్రోఫీతో భారత కోచ్‌గా అనిల్ కుంబ్లే పదవీకాలం ముగియడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.

Comments

comments