Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

అలా అయితే ఓకే..!

Ravi-Shastri-Kohli

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తన పదవికి రాజీనామా చేయడంతో బిసిసిఐ కొత్త కోచ్‌ను ఎంపిక చేసే పనిలో పడింది. తాజాగా బిసిసిఐ కోచ్ కోసం దరాఖాస్తు తేదీని కూడా పొడగించి మరిన్ని దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే ఇదంతా టీమిండియా మాజీ కోచ్ కమ్ మెంటర్ రవిశాస్త్రి కోసమేనని కొందరి వాదన. దీనికి ఊతమిస్తోంది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటన…

ఇటీవల తమకు రవిశాస్త్రి కోచ్ అయితే ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా రవిశాస్త్రి మాత్రం తన కోచ్ పదవిపై కొన్ని షరతులు పెడుతున్నారట. తనను కోచ్‌గా చేస్తానని హామీ ఇస్తేనే దరఖాస్తు విషయంలో ఆలోచిస్తానని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

కోచ్ ఎంపిక కోసం క్యూలో ఉండలేనని బిసిసిఐకి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రవి కోచ్ దరఖాస్తు కంటే ముందుగా షరతులతో కూడిన ఒక మెయిల్‌ను బిసిసిఐ పెద్దలకు పంపారట. తాజా పరిణామాల నేపథ్యంలో రవిశాస్త్రికే కోచ్ పదవి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కొందరు జట్టు సభ్యులు కూడా రవిశాస్త్రివైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక రవికి ఇంతకుముందు టీమిండియాతో కలిసి పనిచేసిన అనుభవం కూడా కలిసొచ్చే అంశమే.

Comments

comments